మొట్ట మొదటగా అందరికి తెలిసిన గమ్మత్తుతో మొదలు పెడదాం.అదే నండి తొమ్మిదో ఎక్కం యొక్క గమ్మత్తు.
9 X 1 = 9
9 X 2 = 18
9 X 3 = 27
9 X 4 = 36
9 X 4 = 45
9 X 6 = 54
9 X 7 = 63
9 X 8 = 72
9 X 9 = 81
9 X 10 = 90
9 X 11 = 99
9 X 12 = 108
9 X 13 = 117
9 X 14 = 126
9 X 15 = 135
9 X 16 = 144
9 X 17 = 153
9 X 18 = 162
9 X 19 = 171
9 X 20 = 180
పైన ఇచ్చిన తొమ్మిదో ఎక్కన్ని బాగా గమనించారా. 9 ని దేనిచే గుణించినా వచ్చిన లబ్దం లోని అంకెలన్నిటిని విడి విడి గా ఒకే అంకె వచ్చే వరకు కూడితే చివరగా మనకి ప్రతి సారి 9 దే వస్తుంది.
ఉదాహరణ కి 9 X 9 తీసుకుందాం. 9 X 9 = 81 కదా. 81 లోని అంకెలని విడి విడి గా కూడదాం ఇప్పుడు. అంటే 8 + 1 = 9 వస్తుంది. అలాగే ఇంకొకటి 9 X 18 = 162 కదా. అందులోని అంకెలు కుడితే 1+6+2 =9. ఇలా లబ్దం లోని అంకెలన్నిటిని ఒకే అంకె వచ్చే వరకు కూడితే మనకి ప్రతిసారి 9 దే వస్తుంది. అర్థం అయ్యిందా ఈ చిన్న గమ్మత్తు.
Thursday, 4 October 2007
Subscribe to:
Comments (Atom)